కులంపాక సోమేశ్వర స్వామి ఆలయ ప్రదక్షిణ
యాదాద్రి: ఆలేరు మండలం కొలనుపాకలో గురువారం ఆరుద్ర నక్షత్రం పర్వదినం పురస్కరించుకొని ప్రాచీన దేవాలయమైన శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయ మహా గిరిప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహించి ఆలయం చుట్టూ భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణ నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.