పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సహాయ కమిషనర్
VSP: మాడుగుల మండలంలో పదో తరగతి పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఏ శ్రీధర్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఆయన ఎంఈవో ఈశ్వర్ రావుతో కలసి పరిశీలించారు. పరీక్ష కేంద్రాల్లో డెస్కులు, విద్యుత్, నీటి సౌకర్యం, ఫ్యాన్లు, తాగునీటి వసతి వంటి అంశాలపై ఆరా తీస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.