‘చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదు'
SKLM: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరాదని సంతబొమ్మాళి ఎస్సై సింహాచలం అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని తెలియజేశారు.