VIDEO: వైభవంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఊరేగింపు
సత్యసాయి: సోమందేపల్లిలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమ జ్యోతుల మహోత్సవం సందర్భంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని గ్రామ వీధులలో భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామమంతా భక్తి వాతావరణంలో మునిగిపోయింది.