'మద్యం సేవించి వాహనం నడిపితే జైలు శిక్ష తప్పదు'
SRCL: కోనరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మందు తాగి వాహనం నడపడం వల్ల తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.