కమల్‌ హాసన్‌కు రాని అదృష్టం నాకు వచ్చింది: జేడీ

కమల్‌ హాసన్‌కు రాని అదృష్టం నాకు వచ్చింది: జేడీ

'గాయపడ్డ సింహం' ప్రెస్ మీట్‌లో కమల్ హాసన్‌పై జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటులందరికీ కమల్ నటనే ఒక బెంచ్ మార్క్ అని, ఆయన చేసినన్ని పాత్రలు సినీ చరిత్రలోనే ఎవరూ చేసి ఉండరని తెలిపాడు. ఒక నటుడిగా ఆయనకు రాని అదృష్టం తనకు ఈ సినిమా రూపంలో దక్కిందన్నాడు. ఇందులో తనది అంత గొప్ప పాత్ర అని, ఇప్పటివరకు కమల్ కూడా చేయని పాత్ర ఇది అని పేర్కొన్నాడు.