15 రోజుల్లో బతుకమ్మ కుంట వలె.. మరో చెరువు సిద్ధం..!
HYD: అంబర్‌పేట బతుకమ్మకుంట వలె మరో చెరువు సిద్ధమవుతోంది. పాతబస్తీకి మణిహరంగా మారిన చారిత్రక బమృక్ నుద్దౌలా చెరువు మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఆక్రమణలతో ఆనవాళ్లను కోల్పోయిన ఈ చెరువు హైడ్రా పునరుద్దరణతో పూర్వ వైభవాన్ని సంతరించుకుందని కమిషనర్ రంగానాథ్ అన్నారు. చెరువుకి తుది మెరుగులు దిద్దుతున్నారు.