విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న సినీ నటుడు గౌతమ్ రాజు
కోనసీమ: ప్రముఖ సినీ నటుడు గౌతమ్ రాజు గురువారం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, భక్తులు గౌతమ్ రాజుకు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి స్వామి వారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు.