అక్రమ బియ్యం రవాణా.. ఇద్దరు అరెస్ట్

అక్రమ బియ్యం రవాణా.. ఇద్దరు అరెస్ట్

CTR: అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు గుడిపాల ఎస్సై రామ్మోహన్ తెలిపారు. తమిళనాడు నుంచి పూర్ణ అనే వ్యక్తి గంగసాగరానికి చెందిన రాజేశ్‌కు రేషన్ బియ్యం సరఫరా చేయగా పలమనేరు బంగారుపేటలలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి 900 కేజీల రేషన్ బియ్యం, ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.