VIDEO: వీధిలైట్లు వెలగక.. అంధకారంలో మగ్గిపోతున్న మందమర్రి

VIDEO: వీధిలైట్లు వెలగక.. అంధకారంలో మగ్గిపోతున్న మందమర్రి

MNCL: మందమర్రి పట్టణం రోజురోజుకు అంధకారంలో మగ్గిపోతుందని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై వీధిలైట్లు వెలగక రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీల్లో విద్యుత్ దీపాలు లేకపోవడంతో మహిళల, వృద్ధులు, విద్యార్థులు భయాందోళన మధ్య జీవనం సాగిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే లైట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.