పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

చిత్తూరు జిల్లాలోని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజాపై (బర్డ్ ఫ్లూ) పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పౌల్ట్రీ పక్షుల్లో అధిక సంఖ్యలో మరణాలు సంభవించినట్లయితే వెంటనే పశుసంవర్ధక శాఖకు లేదా జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వవలసిందిగా సూచించడమైనది.