'ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే దుకాణాలు సీజ్'

'ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తే దుకాణాలు సీజ్'

CTR: పుంగనూరులోని దుకాణాల్లో ఇవాళ మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ముని వెంకటప్ప ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి పట్టణంలోని పలు దుకాణాలపై ఆకస్మిక దాడులు చేశారు. ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న వారికి రూ. 2,200 జరిమానా విధించారు. మరొకసారి విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.