పిఠాపురం పాడా పీడీగా వేణుగోపాలరావు

KKD: పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) పీడీగా పి. వేణుగోపాలరావును నియమిస్తూ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కాకినాడలో సర్వశిక్షా అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC)గా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాలరావుకు పాడా పీడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన బాధ్యతలు చేపట్టారు.