ఉక్రెయిన్ సంక్షోభానికి వాళ్లే కారణం: పుతిన్
ఉక్రెయిన్ సంక్షోభానికి పాశ్చాత్య దేశాలే కారణమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. కీవ్‌లో రాజకీయ మార్పునకు ఆయా దేశాలు మద్దతు ఇవ్వడం, ఆ తర్వాత డాన్‌బాస్, నోవోరోసియాలో చోటుచేసుకున్న పరిణామాలతోనే అసలు సంక్షోభం ప్రారంభమైందని చెప్పారు. అయితే అవి మాస్కో చేపట్టిన చర్యలు కావన్నారు. వీటన్నింటికీ ఆజ్యం పోసింది యూరోపియన్, పాశ్చాత్య దేశాలేనని పేర్కొన్నారు.