ఏలూరులో బాల్యవివాహల నిర్మూలనపై ర్యాలీ
ELR: ఏలూరు గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో హెచ్ఎం జి. సునీత సహకారంతో క్రాఫ్ జిల్లా కోఆర్డినేటర్ ఆర్. వినోద్‌కూమార్ ఇవాళ బాల్యవివాహ వ్యతిరేక ప్రతిజ్ఞ, ర్యాలీ నిర్వహించారు. బాల్యవివాహం నేరమని పేర్కొన్నారు. బాల్యవివాహాలను గుర్తిస్తే ప్రజలు 1098కి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాల్య వివాహాల వల్ల నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.