కొనిసలో రెండు ట్రాక్టర్ల గడ్డి దగ్ధం

VZM: గజపతినగరం మండలంలోని కొనిస గ్రామంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో లోగిస పైడయ్యకు చెందిన రెండు ట్రాక్టర్ల గడ్డి కాలిపోయింది. గడ్డి కాలిపోవడంతో సుమారు 20 వేల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. కాల్చి విసిరేసిన సిగరెట్ కారణంగా ప్రమాదం జరిగింది. గజపతినగరం అగ్నిమాపక అధికారి రవి ప్రసాద్ సంఘటన ప్రాంతానికి వెళ్లి మంటలను అదుపు చేశారు.