రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం
NLG: శాలిగౌరారం మండలం మాదారం గ్రామ శివారులోని టీఆర్ఆర్ కాటన్ మిల్లో నవంబర్ 3 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు చేపడుతున్నట్లు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి చీనానాయక్ తెలిపారు. రైతులు 8–12% తేమ శాతం గల పత్తిని మాత్రమే తీసుకురావాలని, 12% కంటే ఎక్కువ తేమ ఉన్న పత్తిని రిజెక్ట్ చేస్తామని చెప్పారు. నాణ్యమైన పత్తిని తెచ్చి లాభం పొందాలని సూచించారు.