VIDEO: బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు
JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనగాం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వెళ్తూ ఎదురుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైయ్యాయి. గాయపడిన వారు తాటికాయల సంపత్, మందపూరి సంపత్‌గా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.