రెండు కేజీల గంజాయి స్వాధీనం
AKP: అక్రమంగా తరలిస్తున్న 2 కేజీల గంజాయిని పట్టుకున్నామని కృష్ణదేవిపేట ఎస్సై రుషికేశ్వరరావు తెలిపారు. బుధవారం ఏఎల్.పురం శివారులోని అల్లూరి పార్కు సమీపంలో వాహన తనిఖీలు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులను పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద 2 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.