VIDEO: హోటళ్ల బంద్.. గ్యాస్ కొరతపై వెండర్స్ నిరసన
SRPT: జిల్లా కేంద్రంలో గ్యాస్ కొరతను నిరసిస్తూ హోటల్స్ మరియు వెండర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం భారీ బంద్ నిర్వహించారు. టీ స్టాళ్లు, టిఫిన్ బండ్లు, బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్లతో సహా అన్ని రకాల తినుబండారాల దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కలిసిన బాధితులు, గ్యాస్ సరఫరా ఇబ్బందులపై వినతిపత్రం అందజేశారు.