VIDEO: నల్ల చెరువులో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యం
WNP: వనపర్తి పట్టణంలోని 19వ వార్డుకు చెందిన జగదీష్(35) అనే వ్యక్తి నల్ల చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఎస్సై శశిధర్ వివరాల ప్రకారం.. అగ్ని మాపక సిబ్బంది చెరువులో పడవ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒడ్డుకు కొట్టుకొస్తున్న మృతదేహాన్ని చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పంచనమా చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.