ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
BHNG: ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన ధాన్యం పరిమాణం, తేమశాతం, కొనుగోలు పురోగతి గురించి అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు.