జర్నలిస్టు హత్య కేసు.. డేరా బాబాకు ఊరట

జర్నలిస్టు హత్య కేసు.. డేరా బాబాకు ఊరట

20 ఏళ్ల క్రితం జరిగిన జర్నలిస్టు రామచందర్ ఛత్రపతి హత్య కేసులో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను పంజాబ్, హర్యానా హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. దిగువ కోర్టు విధించిన జీవిత ఖైదును కొట్టివేస్తూ హైకోర్టు ఈ కీలక తీర్పునిచ్చింది. సాక్ష్యాధారాల లోపం కారణంగా ఆయనను విముక్తి చేస్తున్నట్లు పేర్కొంది. అయితే, ఇతర కేసుల్లో శిక్ష పడటంతో ఆయన జైలులోనే కొనసాగనున్నారు.