కిషోరి వికాసం పై అవగాహన

NLR: ఇందుకూరుపేట మండలంలోని మైపాడు అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం కిషోరి వికాసం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాల్యవివాహాలు వలన కలిగే నష్టాలను చెప్పారు. బాలికలు 18 సంవత్సరాలు, అబ్బాయిలు 21 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహాం చేసుకోవాలన్నారు. చిన్న వయసులో గర్భం ధరించడం ద్వారా ప్రసవ సమయంలో కలిగే ఇబ్బందులు గురించి తెలియజేశారు.