జిల్లా కలెక్టర్‌తో సమావేశమైన బాసర ట్రిపుల్ ఐటీ అధికారులు

హనుమకొండ: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ ప్రావీణను బాసర ట్రిపుల్ ఐటి అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి స్థల సేకరణపై చర్చించారు. హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో బాసర ట్రిపుల్ ఐటీ విస్తరణ చేపట్టడానికి గల అవకాశాలపై చర్చించారు. వైస్ ఛాన్స్‌లర్ గోవర్ధన్, జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.