కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ పోరాటం

NGKL: కార్మికుల హక్కులపై సీఐటీయూ రాజీలేని పోరాటం చేస్తుందని CITU రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ సమావేశం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను హరించి వేస్తుందని వారు పేర్కొన్నారు. రైస్ మిల్లులో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు.