వృద్ధురాలి మృతదేహాన్ని పీక్కుతిన్న పిల్లులు
TG: మంచిర్యాల జిల్లా మందమర్రిలో గుండె తరుక్కుపోయే ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జక్కనబోయిన లక్ష్మి (80) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందింది. అయితే, ఆకలితో ఉన్న పెంపుడు పిల్లులు ఆమె చేతిని పీక్కుతిన్నాయి. రాత్రి 11 గంటలకు గమనించిన స్థానికులు కుమారులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.