'ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలి'
YDBNR: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. సోమవారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం, పత్తి కొనుగోళ్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతుల పంటలకు న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.