పాత బోర్డుతోనే పాట్లు.. స్థానికుల తీవ్ర ఆగ్రహం

పాత బోర్డుతోనే పాట్లు.. స్థానికుల తీవ్ర ఆగ్రహం

SRPT: సూర్యాపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అధికారుల నిర్లక్ష్యం రోగులను అయోమయానికి గురిచేస్తోంది. రాజీవ్ నగర్ యూపీహెచ్‌సీ పునర్విభజనలో 23వ వార్డులోకి మారినా, బోర్డుపై మాత్రం పాత ‘21వ వార్డు’ నంబరే ఉండటం గమనార్హం. చిరునామా తెలియక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వార్డు నంబర్‌తో కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.