కిడ్నీ వ్యాధులపై పరిశోధనకు ICMR ఆమోదం
AP: శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేసేందుకు ICMR ఆమోదం తెలిపిందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. మూడేళ్ల కాల వ్యవధిలో ఈ పరిశోధన పూర్తిచేసేందుకు.. 3 దశల్లో ICMR రూ.6.2 కోట్లను గ్రాంటు రూపంలో ఇస్తుందని ప్రకటించారు. కిడ్నీ రిసెర్చ్ పేరుతో జరగనున్న ఈ పరిశోధన ద్వారా వ్యాధి బారినపడే వారిని ముందుగానే గుర్తించే వీలుందన్నారు.