'ముగ్గురు డైరెక్టర్లను నియమించాలి'

'ముగ్గురు డైరెక్టర్లను నియమించాలి'

AKP: ఎలమంచిలిలో బుధవారం తూర్పు కాపు జిల్లా కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాకు ముగ్గురు తూర్పు కాపు డైరెక్టర్లను నియమించాలని సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కరణం శ్రీహరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే, తూర్పు కాపుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు.