MEOపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు ఫిర్యాదు
MHBD: నేర చరిత్ర కలిగిన, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీరోలు మండల విద్యాశాఖ అధికారి(MEO) లచ్చి రాంనాయక్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని DSFI నేతలు డిమాండ్ చేశారు. MHBD పట్టణంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో బుధవారం DEO దక్షిణామూర్తికి వారు ఆధారాలతో కూడిన వినతిపత్రం అందజేశారు. సమగ్ర విచారణ చేపట్టి, సర్వీస్ నుంచి తొలగించి, జైలుకు పంపాలని కోరారు.