మైలవరంలో 'ప్రజా దర్బార్'

మైలవరంలో 'ప్రజా దర్బార్'

NTR: ప్రజా సమస్యలను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు అధికారులను ఆదేశించారు. మైలవరం ఆయన కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి మొత్తం 80 అర్జీలను స్వీకరించామన్నారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని చెప్పుకొచ్చారు.