నగరంలో భానుడి భగభగలు మొదలయ్యాయి..!
MDCL: నగరంలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. అటు వాహనాల వేడి, ఇటు నెత్తిన మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయోనని నగర ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.