రైతు బీమాకు జిల్లాలో 2.09 లక్షల మంది అర్హులు

KMM: రైతు బీమా పథకానికి ఖమ్మం జిల్లాలో మొత్తం 2,09,387 మంది రైతులు అర్హులుగా వ్యవసాయ శాఖ గుర్తించింది. వీరిలో నూతనంగా పట్టా పుస్తకాలు పొందిన వారు 10,494 మంది కాగా, ఐదెకరాలలోపు ఉన్న వారు 2,992, ఐదెకరాలకు పైగా ఉన్న వారు 305 మంది, రెన్యూవల్ అయినవారు 1,95,596 మంది ఉన్నారు. జిల్లాలో నూతనంగా 13,791 మంది రైతులు బీమా పథకంలో చేరేందుకు అర్హత కలిగి ఉన్నారు.