రాయదుర్గం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనలు

రాయదుర్గం మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనలు

ATP: రాయదుర్గం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు సీఐటీయూ నాయకులతో కలిసి నిరసనలు వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ.. కార్మికులకు కూటమి ప్రభుత్వం జీతాలు పెంచి ప్రభుత్వం ద్వారానే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.