బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదు: ఎస్సై
E.G: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తప్పవని జగ్గంపేట ఎస్సై టీ. రఘునాథరావు హెచ్చరించారు. జగ్గంపేటలోని పలు ప్రాంతాలను ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేర్వేరు చోట్ల మద్యం సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. ప్రతిరోజు ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.