ధాన్యం లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం
NZB: ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ ఇందల్వాయి టోల్గేట్ వద్ద బుధవారం ఉదయం బోల్తా పడింది. యూ టర్న్ తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. సిరికొండ మండలం చీమన్‌పల్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తీసుకుని లారీ NZBకు బయలు దేరింది. జాతీయ రహదారిపై టోల్గేట్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.