బార్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం
కోనసీమ: అమలాపురం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడుగా కాశీ శేషారావు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. అమలాపురం కోర్టు ఆవరణలో ఉన్న బార్ అసోసియేషన్ భవనంలో నూతన ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కటికదల సత్యనారాయణ నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు న్యాయవాదులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.