పుట్టవారి పాలెంలో కాలువల దుస్థితి
BPT: మండలంలోని పుట్టవారి పాలెంలో కాలువల పరిస్థితి అధ్వాన్నంగా మారినా అధికారులు పట్టించుకోకపోవడంతో 8వ వార్డు సభ్యుడు స్వయంగా చర్యలు చేపట్టారు. కాలువలు మూసుకుపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆయన స్వయంగా శ్రమదానం చేసి కాలువలను శుభ్రం చేసే పనిలో పాల్గొన్నారు. గ్రామ పరిశుభ్రత కోసం ముందుకు వచ్చిన వార్డు సభ్యుడి చర్యలను అభినందిస్తున్నారు.