VIDEO: అదిల్ పేట్ గ్రామ సమీపంలో పెద్దపులి పాదముద్రలు
MNCL: మందమర్రి మండలం అదిల్ పేట్ గ్రామ సమీపంలో గురువారం పెద్దపులి పులి అడుగులు కనిపించాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగు గుర్తులను పరిశీలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకూడదని, పంటలకు రక్షణగా విద్యుత్ వైర్లు అమార్చకూడదని సూచించారు. పంట పొలాల సమీపంలో పులి అడుగులు కనిపించడంతో గ్రామస్థులు భయపడుతున్నారు.