హైదరాబాద్‌లో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్

హైదరాబాద్‌లో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్

HYD: HNEW, మాసబ్ ట్యాంక్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్ పెడ్లర్ పట్టుబడ్డాడు. ఎజామ్ అహ్మద్ వద్ద నుంచి రూ. 12 లక్షల విలువైన MDMA, కొకైన్, OG స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరులో పనిచేసే అహ్మద్.. కొవిడ్ సమయంలో డ్రగ్స్‌కు అలవాటు పడి పెడ్లర్‌గా మారినట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.