తపస్ ఆధ్వర్యంలో పటేల్ జయంతి వేడుకలు
MDK: చేగుంట హైస్కూల్లో తపస్(TAPAS) ఆధ్వర్యంలో సర్దార్ పటేల్ జయంతి ఘనంగా నిర్వహించారు. చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. పటేల్ 1875 అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియాడ్‌లో జన్మించారని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర్యానంతరం 500 పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించరన్నారు.