VIDEO: ఇసుక బోట్లకు భారీ భద్రత ఏర్పాటు

NTR: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఇసుక బోట్లకు భారీ భద్రత కల్పించారు. గతంలో వరదలకు కృష్ణా నదికి ఇసుక బోటు కొట్టుకుపోయింది. అలాంటి సంఘటన మరల చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఇసుక బోట్ల యాజమాన్యం మేల్కొని పవిత్ర సంగమం వద్ద తాళ్లతో కట్టి భద్రపరిచారు. గురువారం ఇసుక బోట్లను గోదావరి నీరు ప్రవహించే ప్రదేశంలో కట్టుదిట్టమైన తాళ్లతో బంధించారు.