రహదారికి అడ్డంగా పడిన చింత చెట్లు..స్పందించిన ఎస్సై

అల్లూరి: కొయ్యూరు మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి నిమ్మలపాలెం, రేవళ్ల గ్రామాల మధ్యలో రెండు భారీ చింత చెట్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న మంప ఎస్సై కే.శంకరరావు వెంటనే తమ సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్నారు. జేసీబీ వాహనంతో చెట్ల తొలగింపు చర్యలు చేపట్టారు.