'డీజే, బహిరంగ మద్యపానంపై నిషేధాజ్ఞల పొడిగింపు'
MNCL: డీజే సౌండ్స్ వినియోగం, బహిరంగ ప్రదేశాల్లో అమల్లో మద్యపానం ఉన్న నిషేధాజ్ఞలను పొడిగించినట్లు CP అంబర్ కిషోర్ ఝా ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు కూడా ఏప్రిల్ 1వ తేది వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.