వెలల చెరువు పంచాయతీలో ఆడిట్

BPT: సంతమాగులూరు మండలంలోని వెలల చెరువు గ్రామపంచాయతలో గురువారం ఆడిట్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీలను రికార్డులను క్షుణ్ణంగా జిల్లా అధికారులు పరిశీలించారు. అనంతరం ఆ నివేదికను పొందుపరిచారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు తెలియపరుస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు తదితరులు ఉన్నారు.