VIDEO: మరో మేడారంగా చింతలగట్టు జాతర
MHBD: గూడూరు మండలం వట్టివాగు చింతలగట్టులో ఈ నెల 28 నుంచి శ్రీ సమ్మక్క–సారక్క వనదేవతల జాతర ప్రారంభం కానుంది. మేడారం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన ఈ జాతరను భక్తులు ‘మరో మేడారం’గా పిలుస్తున్నారు. మచ్చర్ల అడవుల్లో జరిగే ఈ జాతరకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో అధికారులు పనులు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన పూజారి దరవద్ సిద్దు శుక్రవారం తెలిపారు.