సదాశివ నగర్ PHC లో అమ్మఒడి కార్యక్రమం

సదాశివ నగర్ PHC లో అమ్మఒడి కార్యక్రమం

KMR: సదాశివనగర్ పీహెచ్‌సీలో గురువారం అమ్మఒడి కార్యక్రమం నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డా.అస్మా అఫ్సీన్ తెలిపారు. పీహెచ్‌సీ పరిధిలోని గర్భిణులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేయించారు. అనంతరం మందులు పంపిణీ చేసి రక్త హీనతతో బాధపడుతున్న మహిళలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.