గండి క్షేత్రానికి వర్తించని ఫ్రీ బస్ పథకం

KDP: శ్రావణమాస 4వ శనివారం సందర్భంగా గండి అంజన్న క్షేత్రానికి ఆర్టీసీ అధికారులు స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు నిన్న ప్రభుత్వం స్త్రీ శక్తి(ఫ్రీ బస్) పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఈ ఆలయానికి వెళ్లేందుకు మహిళలు ఆసక్తి చూపారు. అయితే ఈ బస్సులపై 'స్త్రీ శక్తి పథకం వర్తించదు' అనే బోర్డు చూసిన మహిళలు నిరాశకు గురయ్యారు. కాగా, స్పెషల్ బస్సులకు వర్తించదని RTC ముందే ప్రకటించింది.